calender_icon.png 13 January, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మో.. ఒక్క గుడ్డుకు ఇంత ధరా!

19-12-2024 01:53:34 AM

* యూకే వేలంలో రూ.21వేలు పలికిన సంపూర్ణ గోళాకార గుడ్డు

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: సాధారణంగా గుడ్డు కాస్త దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. నూటికో కోటికో ఒకటి మాత్రమే కాస్త వృత్తాకా రంగా ఉంటుంది. అయితే యూకేలో ఓ గుడ్డు మాత్రం సంపూర్ణ గోళాకారంగా ఉండటంతోపాటు ఏకంగా రూ.21వేల ధర పలికింది. ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్ కౌంటీకి చెందిన లువెంటాస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కోసం ఓ పబ్‌లో సంపూర్ణ గోళాకారంగా ఉన్న గుడ్డు వేలానికి వచ్చింది. ఈ క్రమంలోనే పబ్‌లో ఉన్న పౌనెల్ అనే వ్యక్తి ఆ గుడ్డును వేలంలో ఏకంగా 200 పౌండ్లకు (సుమారు రూ. 21వేలు) దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధి రోజ్ రాప్ ఆనందం వ్యక్తం చేశారు. వేలం ద్వారా వచ్చిన డబ్బులు మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న 13 బాధితులకు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కాగా, లువెంటాస్ ఫౌండేషన్ ఆక్స్‌ఫర్డ్‌షైర్ కౌంటీ వ్యాప్తంగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న యువతకు మానసిక ఆరోగ్య సహాయాంతోపాటు లైఫ్ కోచింగ్‌ను అందిస్తోంది.