calender_icon.png 22 October, 2024 | 11:11 PM

అల్ట్రాటెక్ సిమెంట్ నికరలాభం రూ.825 కోట్లు

22-10-2024 01:18:28 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 21:  ఆదిత్యా బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్  2024 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 825 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జిం చింది. నిరుడు ఇదేకాలంలో నమోదుచేసిన రూ.1,280 కోట్ల నుంచి తాజా క్యూ2లో లా భం భారీగా క్షీణించినప్పటికీ, ఆ ఫలితాలతో పోల్చరాదని అల్ట్రాటెక్ పేర్కొంది.

యూఏఈకి చెందిన రస్ ఆల్ ఖైమా అండ్ కోలో అల్ట్రాటెక్ వాటాను  54 శాతానికి పెంచుకోవడంతో అది అల్ట్రాటెక్‌కు సబ్సిడరీగా మారినందున, తాజా త్రైమాసికంలో యూఏఈ కంపెనీ ఫలి తాలు కూడా కలిసి ఉన్నాయి. ఈ క్యూ2లో అల్ట్రాటెక్ సిమెంట్ ఆదాయం రూ.15,634 కోట్లుగా ఉన్నది.

గత ఏడాది రెండో త్రైమా సికంలో రూ. 16,012 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్టాండెలోన్ ప్రాతిపదికన అల్ట్రా టెక్ సిమెంట్ నికరలాభం 34.71 శాతం క్షీణించి రూ.796.89 కోట్లకు తగ్గింది. స్టాం డెలోన్ ఆదాయం 3.68 శాతం తగ్గుదలతో రూ.14,905 కోట్లుగా నమోదయ్యింది. ఫలి తాల నేపథ్యంలో అల్ట్రాటెక్ సిమెంట్ షేరు సోమవారం బీఎస్‌ఈలో 1.9 శాతం తగ్గి రూ.10,847 వద్ద ముగిసింది.