న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఆదిత్యా బిర్లా గ్రూ ప్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ మరో సిమెంట్ కంపెనీని చేజిక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ దిశగా మేఘా లయకు చెందిన స్టార్ సిమెంట్‌లో ప్రమోటర్ల నుంచి 8.69 శాతం మైనారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. షేరుకు రూ.235 ధర చొప్పున రూ. 851 కోట్లతో వాటా కొనుగోలు ప్రతిపాదనను డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని అల్ట్రాటెక్ శుక్రవారం తెలిపింది.
గౌతమ్ అదానీ గ్రూప్ సిమెంట్ వ్యాపారం నుంచి పోటీపెరగనున్న నేపథ్యంలో అల్ట్రాటెక్ దక్షిణాది కంపెనీ ఇండి యా సిమెంట్స్ టేకోవర్‌ను పూర్తిచేసిన మూ డు రోజులకే ఈ పరిణామం చోటుచేసుకున్న ది. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్, బిహార్‌ల్లో మార్కెట్ ఉన్న స్టార్ సిమెంట్ వార్షిక స్థాపక సామర్థ్యం 7.7 మిలియన్ టన్నులు.