calender_icon.png 2 February, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలను చట్ట ప్రకారం నిర్వహించాలి

01-02-2025 09:52:44 PM

భద్రాచలం (విజయక్రాంతి): అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలను చట్ట ప్రకారం నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.హెచ్‌.ఎన్ డా.ఆర్.పి.చైతన్య, డిప్యూటీ డెమో ఎం.డి. ఫైజ్ మొహియుద్దీన్ సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా.ఎల్.భాస్కర్ నాయక్ ఆదేశాల మేరకు శనివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.హెచ్‌.ఎన్ డా.ఆర్.పి.చైతన్య, డిప్యూటీ డెమో ఎం.డి. ఫైజ్ మొహియుద్దీన్ భద్రాచలంలోని అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్స్ ను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్స్ ను నిర్వహించే వారు ఎఫ్ ఫార్మ్ లో రికార్డులను నమోదు చేయాలని, నమోదు చేసిన ఎఫ్ ఫార్మ్ ను సకాలంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి పంపాలని, గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే పిసి.పిఎన్.డిటి యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.