calender_icon.png 3 April, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ట్రా సౌండ్ మెషిన్ సీజ్

27-03-2025 01:20:42 AM

కరీంనగర్, మార్చి26 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్  ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ  ఆధ్వర్యంలో అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఫెర్టిలిటీ   కేంద్రాల స్పెషల్ డ్రైవ్ టీం తనిఖీలు నిర్వహించారు.

శ్రీలత మెటర్నటీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో అనధికారికంగా రిజిస్టర్డ్ కానీ మొబైల్ అల్ట్రా సౌండ్ మిషను కనుగొని రెవెన్యూ, పోలీస్ శాఖ ఏఎస్‌ఐతో కూడిన స్పెషల్ డ్రైవ్ తనిఖీ బృందము శ్రీలత మెటర్నిటీ నర్సింగ్ హోమ్ కి నోటీసు ఇచ్చి మొబైల్ అల్ట్రా సౌండ్ మిషను సీజ్ చేశారు.

అదేవిధంగా హాస్పిటల్లో స్కానింగ్‌కు వచ్చే పేషెంట్లు వివరాలతో కూడిన ఫామ్ ఎఫ్ ఫారం ను  పూర్తి చేసి ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్లో అప్డేట్ చేస్తున్న విధానాన్ని, అవుట్ పేషెంట్ రిజిస్టర్ లు, పి.సి.పి.ఎన్.డి.టి జిల్లా అప్రోప్రియేట్ అథారిటీ  కమిటీ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, అందులో పని చేస్తున్న డాక్టర్స్ క్వాలిఫికేషన్ వెరిఫికేషన్ , గర్బస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్దారణ చట్టం  1994 రూల్స్ 1996 అమలవుతున్న తీరు వివరించారు.

గర్బస్థ  శిశువుగా ఉన్నప్పుడూ స్త్రీ, పురుష లింగ నిర్దారణ పరీక్షలు చేసినట్లయితే పరీక్షలు చేసిన వారికి, చేయించు కున్న వారికి, అందుకు ప్రోత్సహించిన వారికి చట్ట ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైల్ శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించబడుతుందని, అలాగే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని  తెలిపే బోర్డులు ప్రదర్శిస్తున్నారా లేదా మరియు స్కాన్నింగ్ కేంద్రాలలో కచ్చితంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ధరల పట్టిక, సరైన రికార్డుల నిర్వహణ ఉండాలని ఆదేశించారు.

ప్రతి నెల జరిగే స్కానింగ్ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి పంపిస్తున్న తీరు, లింగ నిర్దారణ పరీక్షలు చట్ట రీత్యా నేరమని, పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని చెప్పకూడదని బోర్డులు స్కానింగ్ కేంద్రాలలో ప్రదర్శించడాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ స్కానింగ్ కేంద్రల, ఫెర్టిలిటీ కేంద్రాల యొక్క తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డాక్టర్ వెంకటరమణ  తెలియజేశారు.