calender_icon.png 22 October, 2024 | 5:00 AM

అల్ట్రా స్టులిష్ ‘రాజాసాబ్’

22-10-2024 12:00:00 AM

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ చిత్రం ‘రాజాసాబ్’ నుంచి అభిమానులు ఎదురుచూస్తున్న తీపి కబురు వచ్చేసింది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇవ్వనున్నట్టు మేకర్స్ తాజా ప్రకటన చేశారు. సోమవారం విడుదల చేసిన అప్డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ప్రభాస్ అల్ట్రా స్టులిష్‌గా కనిపిస్తున్నారు.

సినిమాలో ఆయన లుక్, మేకోవర్ చాలా కొత్తగా ఉండబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందుతోందీ సినిమా. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ తుది దశలో ఉంది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు; సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని; మ్యూజిక్: తమన్; ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, కింగ్ సోలొమన్; ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్; క్రియేటివ్ ప్రొడ్యూసర్: ఎస్‌కేఎన్; కో ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృతి ప్రసాద్; ప్రొడ్యూసర్: టీజీ విశ్వప్రసాద్; రచన, దర్శకత్వం: మారుతి. 

టోక్యో అభిమానుల అడ్వాన్స్ విషెస్ 

ప్రభాస్ ఎల్లలులేని ఛరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. జపాన్‌లో ప్రభాస్‌ను ఇష్టపడే అభిమానుల సంఖ్య మరీ ఎక్కువ. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ముందుగానే ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు జపాన్‌లోని టోక్యో రెబెల్ స్టార్ ఫ్యాన్స్.

‘రాధేశ్యామ్’ సినిమా ప్రత్యేక షో చూసిన అనంతరం హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అని రాసి ఉన్న బ్యానర్స్ ప్రదర్శిస్తూ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.