calender_icon.png 12 February, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలసదారులపై యూకే ఉక్కుపాదం

11-02-2025 12:52:00 AM

పోలీసుల అదుపులో 609మంది

లండన్: ట్రంప్ బాటలోనే యూకే  కూడా నడుస్తోంది. యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) కూడా తమ దేశంలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించి ఉపాధి పొందుతున్న 600కు పైగా వలసదారులను సోమవారం యూకే ప్రభుత్వం తమ అదుపులోకి తీసుకుంది.

దీనిపై బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కూడా స్పందించారు. ‘యూకేలో అక్రమ వలసలు పెరిగాయి. చాలా మంది దేశంలోకి అక్రమంగా చొరబడి ఉపాధి పొందుతున్నారు. వలసలను ఉపేక్షించేది లేదు’ అని సమాధానమిచ్చారు. ఈ ఏడాది జనవరిలో ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వి భాగం 828 ప్రాంగణాల్లో జల్లెడ పట్టి 609 మందిని అదుపులోకి తీసుకుంది.

జనవరి 2023తో పోలిస్తే అక్రమ వలసదారులు 48 శాతం పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు యూకే లో అక్రమంగా పనిచేస్తోన్న దాదాపు నాలుగువేల మందిని అరెస్ట్ చేసినట్లు యూకే హో ంశాఖ తమ గణాంకాల్లో స్పష్టం చేసింది. యూకేకు వలసవచ్చిన వారిలో అధికంగా ఇ ంగ్లీష్ చానెల్ ఈదుకుంటూ వచ్చినట్లు తేలి ంది.

గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 25 శా తం మేర పెరిగిందని హోంశాఖ తెలిపింది. త్వరలో అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్‌లో చర్చ జరగనుంది.