- ౩4 డ్రోన్లతో విరుచుకుపడిన కీవ్
- రాజధాని మాస్కో లక్ష్యంగా దాడులు
- అన్ని డ్రోన్లను కూల్చేశామని రష్యా వెల్లడి
మాస్కో, నవంబర్ 10: రష్యా-ఉక్రెయి న్ మధ్య రెండేళ్ల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఆదివారం ౩4 డ్రోన్లను ప్రయోగించింది. రాజధానితో పా టు రామెన్‌స్కోయ్, కొలోమెన్‌స్కీ ప్రాం తాల్లో ఉక్రెయిన్ టార్గెట్ చేసిం ది.
దాడుల కారణంగా రష్యన్ ప్రభుత్వం మాస్కోలోని డొమోడెడోవో, జుకోవో విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిం ది. ఉక్రెయి న్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా సైనిక వర్గాలు తెలిపాయి. దాడుల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని వెల్లడించాయి.
యుద్ధంపై ట్రంప్ కీలక నిర్ణయం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపు తాననిడోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ముందు ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు దేశాల సైన్యాల 800 మైళ్ల బఫర్ జోన్ అమలు చేసే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం.
ట్రంప్ ప్రతిపాదనకు రష్యా మద్దతు ఇవ్వగా, రష్యా నిర్ణయాన్ని గౌరవించేలా ‘నాటో’లో చేరకుండా సుదీర్ఘ కాలం దూరంగా ఉండేందుకు ఉక్రెయిన్ అంగీకరించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. బదులుగా అమెరికా ఉక్రెయిన్‌కు భారీగా ఆ యుధ సంపత్తి ఇస్తుందని మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
రష్యాలో అక్టోబర్ విషాదం
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం రెండు దేశాల సైనికులనూ పొట్టనపెట్టుకుంది. అక్టోబర్‌లో రష్యన్ సైన్యంలో భారీగా ప్రాణనష్టం సంభవించిందని, దీనినే అ క్టోబర్ విషాదంగా కొందరు పేర్కొంటున్నారు. దీనిపై బ్రిటన్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అడ్మిరల్ సర్ టోని రాడాకిన్ తా జా ఇంటర్వ్యూలో విస్తుపోయే విషయాలు వెల్లడించారు. గత నెలలో జరి గిన యుద్ధంలో 1,500 మం ది రష్య న్ సైనికులు మృతిచెందారని వెల్లడించారు.
యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు ఏడు లక్షల మం ది అసువులు బాశారన్నారు. దేశాధ్యక్షు డు పుతిన్ ఆశయం కోసం అక్కడి ప్రజ లు మూల్యం చెల్లించుకోవడం విషాదకరమన్నారు. రష్యా వ్యయంలో 40 శాతం సొమ్మును ర క్ష ణ, భద్రత కోస మే వెచ్చిస్తున్నారం టే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అ యితే దీనిపై రష్యా నోరు విప్పలేదు.