calender_icon.png 16 November, 2024 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

11-09-2024 12:08:18 AM

140కిపైగా డ్రోన్లతో వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు యత్నం

గగనతలంలోనే పేల్చేసిన రష్యా సైన్యం

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 10: రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. గతకొద్దిరోజులుగా రెండు దేశాలు ఒకరిపై ఒకరు బాంబుల దాడితో విరుచుకుపడుతుండగా తాజాగా.. ఆదివారం రష్యా భూభాగంపై ఉక్రెయిన్ సైన్యం దాదాపు 140కి పైగా డ్రోన్లతో దాడికి యత్నించింది. అయితే అప్రమత్తమైన రష్యా సైన్యం ఆ డ్రోన్లను గగనతలంలోనే పేల్చివేశామని రష్యా రక్షణ  శాఖ మంగళవారం తెలిపింది. ‘ఉక్రెయిన్‌కి చెందిన దాదాపు 144 డ్రోన్లు ఆదివారం రాత్రి రష్యాలోని.. బ్రియాన్స్ ప్రాంతంపై 71, మాస్కో ప్రాంతంపై 20, కుర్స్ ప్రాంతపై 14, తులా ప్రాంతంపై 13, మరో 5 ప్రాంతాలపై 25 డ్రోన్లను ప్రయోగించి భారీ పేలుళ్లకు యత్నించింది. అయితే అప్రమత్తమైన రష్యా సైన్యం డ్రోన్లను గాలిలోనే పేల్చివేసింది’ అని తెలిపారు.