కుర్క్స్ ప్రాంతంలోకి కీవ్ దళాలు
చొరబాటును అణిచివేస్తాం: పుతిన్
న్యూ ఢిల్లీ, ఆగస్టు 9: ఉక్రెయిన్ దళాలు రష్యా సరిహద్దు దాటి దాదాపు ౩౦ కిలోమీటర్ల మేర చొచ్చుకు వెళ్లాయి. దాదాపు 1000 మంది ఉక్రెయిర్ సైనికులు 24కు పైగా సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులతో మంగళవారం రష్యా నైరుతి కుర్క్స్ ప్రాంతంలోకి ప్రవేశించారు. కుర్క్స్‌లో ఉక్రెయిన్ చొరబాటును కవ్వంపు చర్యగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. చొరబాటు అనంతరం ఉక్రెయిన్ సైన్యం ఎలాంటి ముందస్తు వార్నింగ్ ఇవ్వకుండా పౌర భవనాలు, అంబులెన్స్‌లపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతోందని.. దీనికి ధీటుగా బదులిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. గురువారం పుతిన్ రక్షణ, భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్ సైన్యానికి ధీటైన సమాధానం ఇవ్వాలని పుతిన్ వారిని ఆదేశించారు.