calender_icon.png 16 January, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూకే.. ఓ ఇస్లామిస్ట్ దేశం

18-07-2024 12:05:00 AM

రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు

వాషింగ్టన్, జూలై 17: ట్రంప్ ప్రధాన అనుచరుడు, రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. గతవారం వాన్స్ మాట్లాడుతూ.. అణ్వాయుధాన్ని పొందే మొ దటి ఇస్లామిస్ట్ దేశం ఏదై ఉంటుందని తన స్నేహితుడితో చర్చించానని.. అది ఇరాన్ కా వచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అది యూకే కావచ్చని నా అభిప్రాయం అని చెప్పారు.

వాన్స్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..

బ్రిటన్ ఉప ప్రధాన మంత్రి ఏంజెలా  మాట్లాడుతూ.. మేము వాన్స్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ వాన్స్..

చైనాను అమెరికాకు అతిపెద్ద ముప్పుగా అభివర్ణించాడు. ఉక్రెయిన్ యుద్ధం గురించి  మీడియా ప్రశ్నించగా.. ట్రంప్.. మాస్కో, కైవ్‌లతో చర్చలు జరిపి పరిష్కార మార్గం చూపుతారని వాన్స్ తెలిపారు.