16-04-2025 01:27:17 AM
జహీరాబాద్, ఏప్రిల్ 15 : మండుటెండలకు తాగడానికి నీరు దొరకపోవడంతో జహీరాబాద్ పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి సొంత డబ్బుతో బోర్ వేయించి దాహార్తిని తీర్చడానికి ముందుకు వచ్చారు.
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ లో ఒకటి, రాంనగర్ లో రెండు బోర్లు వేయించారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి సమస్యల ను పరిష్కరించడంలో ఉజ్వల్రెడ్డి ముందుంటున్నారని ప్రజలు కొనియాడుతున్నారు. బోర్లు వేయించడం పట్ల కాలనీవాసులు హర్షంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.