calender_icon.png 26 April, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొంత నిధులతో బోరు వేయించిన ఉజ్వల్ రెడ్డి

25-04-2025 12:30:44 AM

జహీరాబాద్, ఏప్రిల్ 24 : ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నా యకులు ఉజ్వల్ రెడ్డి తన సొంత నిధులతో బోర్ వేయించారు. గురువారం  జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో ప్రజల విజ్ఞప్తి మేరకు బోరు వే యించారు.  ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు  పడుతున్నందున బోర్ వేయడం జరిగిందన్నారు.  గతంలో కూడా వివిధ కాలనీలలో సొంత నిధులతో బోరు వేయించి వారి దా హార్తిని తీర్చామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమ య్య,  పట్లోళ్ల శ్రీనివాస్ రెడ్డి,  నాగిరెడ్డి, అశ్వి న్ పటేల్,  ప్రతాపరెడ్డి, అరుణ్ కుమార్ గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, జావీద్, మల్లికార్జున్, అక్బర్, హర్షద్ పటేల్, పాల్గొన్నారు.