calender_icon.png 29 November, 2024 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూహెచ్‌టీసీకి స్థలం కేటాయించాలి

28-08-2024 03:33:26 AM

మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఎయిమ్స్‌కు అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న అర్బన్ హెల్త్ అండ్ ట్రెయినింగ్ సెంటర్ (యూహెచ్‌టీసీ)కు అవసరమైన 2 ఎకరాల స్థలాన్ని బీబీనగర్ మండల పరిధిలోని రంగాపూరంలో స్థలం కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రిని, సీఎస్‌ను భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహ్మరెడ్డి కోరారు. ఇందుకు సంబంధించి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

రంగాపూరం గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నదన్నారు. హైదరాబాద్ జాతీ య రహదారి పక్కనే రంగాపూరం ఉన్నదని, హైదరాబాద్‌కు కూడా అతి చేరువలో ఉం టుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు సమీపంలో ఉండటం వలన విద్యార్థులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు.

కొమ్మిడిని పరామర్శించిన ఎంపీ చామల

యాదాద్రి భువనగిరి(విజయక్రాంతి): భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డిని మంగళవారం భువనగిరి ఎంపీ చామ ల కిరణ్‌కుమార్‌రెడ్డి పరామర్శించారు. ప్రజానాయకుడిగా పేరొందిన నర్సింహారెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుసుకున్న ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆయనను కలిసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు.