calender_icon.png 11 January, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు యుజిసి వేతనాలను అమలు పరచాలి

03-01-2025 10:35:23 PM

తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అద్యాపకుల డిమాండ్...

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్ లో పనిచేస్తున్న అధ్యాపకులను పర్మినెంట్ చేయాలని శుక్రవారం ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ సౌత్ క్యాంపస్ లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులకు యూజీసీ పేస్కేల్స్ అమలు పరచాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేస్తున్న 1445 మంది ఒప్పంద అధ్యాపకులకు అధ్యాపకులకు ఉద్యోగ భద్రతతో కూడిన బేసిక్ +డి ఎ + హెచ్ ఆర్ ఎ +3% ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా మాట్లాడుతూ.. 12 యూనివర్సిటీలో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టర్ బేసిక్ ప్లస్ డి.ఎ, హెచ్ఆర్ఎతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరడం జరిగిందన్నారు.

తెలంగాణ విశ్వవిద్యాలయాలాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తగిన అన్ని అర్హతలు ఉన్నాయని, నూతన విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తాము పునాది రాళ్లుగా  పనిచేస్తున్నామన్నారు. తమను విస్మరించడం చాలా బాధాకరమని, గత 15 సంవత్సరాల నుండి యూనివర్సిటీ నమ్ముకొని పనిచేస్తున్నామన్నారు. తమను రెగ్యులరైజ్ చేయటం వల్ల కానీ స్కేల్ అమలుపరచడం వల్ల కానీ ప్రభుత్వానికి భారం కాదని, ఉన్నత విద్యను ప్రోత్సహించినట్ల అవుతుందన్నారు. రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు, విద్యాశాఖ మాత్యులు రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి తమ న్యాయమైన కోరికలను తీర్చాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి మీ హామీని మీరు నిలబెట్టుకుని మాకు న్యాయం చేయగలరని ప్రధానంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో డాక్టర్.. యాలాద్రి, డాక్టర్ సునీత, డాక్టర్ నరసయ్య, శ్రీకాంత్, డాక్టర్ రమాదేవి, దిలీప్ డాక్టర్ సరిత, డా.శ్రీమాతా మిగతా ఉపాధ్యాయ బృందాలు పాల్గొన్నారు.