తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతికి వినతిపత్రం...
కామారెడ్డి (విజయక్రాంతి): యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు యుజిసి పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతికి వినతిపత్రాన్ని అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులకు యూజీసీ పే స్కేల్స్ అమలుపరచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని ధర్నా చేశారు. ధర్నా కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పున్నయ్య మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యా వ్యవస్థను, విశ్వవిద్యాలయ అభివృద్ధిలో కాంట్రాక్ట్ అధ్యాపకుల పాత్ర విశ్వవిద్యాల అభివృద్ధిలో వీరి పాత్ర ఎనలేనిదని, వీరి సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని లేనియెడల బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ ను అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ సత్యనారాయణ, హాస్టల్ చీఫ్ గార్డెన్ మహేందర్ రెడ్డి, ప్రొఫెసర్ జెట్లింగ్ ఎల్దోస, అబ్దుల్ కవి తదితరులు మద్దతు తెలిపారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య వై.యాదగిరిరావు, రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం యాదగిరిని కలిసి కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని వీరి సేవలను గుర్తించి రెగ్యులరైజ్ లేదా పే స్కేల్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపకులపతి స్పందిస్తూ విశ్వవిద్యాలయాల అభివృద్ధిలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను సద్వినియోగం చేసుకోవడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. మీ సమస్యలను సానుకూలంగా స్పందించి తన వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా.దత్త హరి, యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ యస్.నారాయణ మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుండి యూనివర్సిటీ నమ్ముకొని పనిచేస్తున్నాం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయటం వల్ల కానీ స్కేల్ అమలుపరచడం వల్ల కానీ ప్రభుత్వానికి భారం కాదని, ఉన్నత విద్యను ప్రోత్సహించినట్లయితే, రాష్ట్ర భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు, విద్యాశాఖ మాత్యులు రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తక్షణమే స్పందించి తమ న్యాయమైన కోరికను కోరికలను తీర్చాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గంగా కిషన్, కిరణ్ రాథోడ్, డాక్టర్. జోత్స్న, డాక్టర్ రామలింగం,, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సునీత, డాక్టర్ రమాదేవి, వైశాలి, శ్వేత, రాజేశ్వర్, శ్రీకాంత్, దక్షిణ ప్రాంగణం, సారంగాపూర్ క్యాంపస్ కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు.