calender_icon.png 15 January, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నుమూసిన ఉగాండా అథ్లెట్

06-09-2024 01:38:36 AM

నైరోబి: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఉగాండా మారథాన్ రన్నర్ రెబెక్కా చెప్టెగీ మృత్యువుతో పోరాడుతూ కన్నుమూసింది. కెన్యాలో నివాసం ఉంటున్న ఆమె మీద రెండు రోజుల క్రితం ఆమె బాయ్‌ఫ్రెండ్ పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చేరింది. గురువారం ఉదయం ఆమె కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. పారిస్ క్రీడల్లో పాల్గొన్నా కానీ ఆమె పతకం గెలవలేదు. దాడి ఘటనకు గృహ హింసనే కారణం అని కెన్యా పోలీసులు తేల్చారు.