నల్లగొండ, జూలై 1 (విజయక్రాంతి): సామాజిక సేవకుడు, నల్లగొండ జిల్లాకు చెందిన సుంకరి ఆనంద్ తెలుగు అసోసియే షన్ ఆఫ్ మలేషియా (టీఏఎమ్) ఆధ్వర్యం లో అందజేసిన అంతర్జాతీయ మలేషియా ఉగాది కీర్తిరత్న పురస్కారం అందుకున్నారు. ఆదివారం రాత్రి ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌ఆర్‌ఐ కల్చరల్ అసోసియేషన్ (ఎఫ్‌ఎన్ సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సుంకరి ఆనంద్‌ను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా టీఏఎమ్ అధ్యక్షుడు డా. వెంకట ప్రతాప్ మాట్లాడుతూ.. అనాథలు, మానసిక దివ్యాంగులను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించి వారికి మరో జన్మనిస్తున్న ఆనంద్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా జాతీయ మహిళా అధ్యక్షరాలు డా. కౌశీల్యా జువల్, ఎఫ్‌ఎన్‌సీఏ అంతర్జాతీయ అధ్యక్షుడు డా. ఎమ్‌జేఈఆర్ వరప్రసాద్ పాల్గొన్నారు.