31-03-2025 12:00:00 AM
జగిత్యాల, మార్చి 30 (విజయక్రాంతి): సృష్టి ఆరం భించిన పర్వదినం యుగాది, కాలక్రమేనా ఉగాదిగా మారిందని ప్రముఖ వేద పండితులు పాలెపు రామకృ ష్ణశర్మ పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని వాసవి కళ్యాణ భవనంలో ఆదివారం జరిగిన ఉగాది వేడుకలో భాగంగా సాయంత్రం పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు మోటూరి రాజు, కార్యదర్శి బుడికే శ్రీకాంత్, కోశాధికారి నీలి సంతోష్ వేద పండిత సన్మానం శాస్త్రోప్తంగా నిర్వహించారు. అనంతరం నూతన పంచాంగ పూజ, ఉగాది పచ్చడి తీర్థ వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు రాము శర్మ మాట్లాడుతూ తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే ఐదు విషయాలను వివరించేదే పంచాంగం అన్నారు.
ఉగాది అనే పదం నక్షత్ర గణనకు సంబంధించి పుట్టిందన్నారు. బ్రహ్మదేవుడు కలియుగాన్ని సృష్టించడం మొదలు పెట్టింది కూడా ఈ ఉగాదినాడేనని, అందుకే యుగాది అనే పదం ఉగాదిగా మారిందని వివరించారు. ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరం అంటే విశ్వవ్యాప్తి అయినటువంటి ప్రేమను పంచే సంవత్సరమని అర్థం అన్నారు.
విశ్వాన్ని అంతటినీ ఆవరించిన ఆ విష్ణుమూర్తి, లయకారుడైన మహేశ్వరుల అంశ కలిగిన సంవత్సరం అని వివరించారు. ఈ ఏడాది మన భారతదేశం ప్రపంచానికి విశ్వ గురువుగా నిలిచి, మార్గదర్శిగా ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మ ప్రచార సమితి తెలంగాణ ఆధ్వర్యంలో అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరికృష్ణ, చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజు వేద పండితులు రాము శర్మను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు పలువురుని ఆకట్టుకున్నాయి. అనంతరం ఆర్య వైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. అనంతరం వాసవి సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం నిర్వహించారు .
ఈ కార్యక్రమంలో వాసవి సీనియర్ సిటిజన్ అధ్యక్షులు పడిగెల శ్రీనివాస్, అవోపా అధ్యక్షులు కోటగిరి మహేష్, నాయకులు ముక్క రాము, మంచాల రాజలింగం, బొద్దుకూరి శ్రీమన్నారాయణ, సుందర వరదరాజన్, చక్కరి వెంకటేశ్వర్, కొత్త సాగర్, పొద్దుటూరి జలంధర్, కొత్త గణేష్, దొంతుల శ్రీనివాస్, మేడి కేషన్, ఎల్లంకి కృష్ణ, ఒజ్జల రమణ, శ్రీనివాస్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.