31-03-2025 12:00:00 AM
మద్నూర్ విండో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్
బిచ్కుంద మార్చి 30(విజయ క్రాంతి) ప్రకృతితో మమేకమైన పండుగ ఉగాది పండుగ అని కామారెడ్డి జిల్లా మద్నూర్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ ప్రజల కు మద్నూర్, పెద్ద ఎక్లరా గ్రామ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరుగాలని మద్నూర్ సోసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమై, వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం ప్రేమాభిమానాలతో పాల్గొనే సబ్బండ వర్ణాలకు ఉగాది గొప్ప పర్వదిమనన్నారు. సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను ప్రార్థించారు. రైతులు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని.. వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని చెప్పారు.