calender_icon.png 2 April, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షడ్రుచుల సమ్మేళనమే ఉగాది

31-03-2025 12:00:00 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, మార్చ్ 30 (విజయక్రాంతి): షడ్రుచుల సమ్మేళనమే మన తెలుగు ఉగాది నూతన సంవత్సర పండుగ అని, ఈ సంవత్సరం మంచి చేసిన వారికి 100 శాతం మంచి జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకరన్నారు.   

శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో స్ధానిక వినాయక చౌక్ లోని సరస్వతి శిశుమందిర్ వద్ద ఆదివారం నిర్వహించిన తెలుగు నూత న సంవత్సర ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస, శారదా మాత, స్వామి వివేకానంద చిత్ర పటాలకు పులమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రజలకు ఉగాది పచ్చడి, గుడాలు పంపిణీ చేశారు. లాలా మున్న, జోగు రవి, ఆకుల ప్రవీణ్, వేదవ్యాస్ పాల్గొన్నారు.