30-03-2025 08:43:48 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే ఆయా గ్రామాలలో దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళలో గ్రామ దేవతల చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లను రంగులతో అలంకరించి గ్రామ దేవతల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని ఎర్ర పహాడ్ దేవికలాన్ నందివాడ చిట్యాల తాడువాయి కరేడ్పల్లి బ్రాహ్మణపల్లి చందాపూర్ సంగోజువాడి కృష్ణాజివాడి గ్రామాల్లో ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు యువకులు పాల్గొన్నారు.