31-03-2025 12:00:00 AM
సాంప్రదాయ దుస్తులతో ఎమ్మెల్యే వారి మిత్రబృందం సందడి
ఇల్లందు టౌను, మార్చి 30 (విజయ క్రాంతి):- విశ్వ వాసు నామ సంవత్సరంలో నియోజకవర్గంలో ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరికి మంచి జరిగి ఆనందంగా ఉండాలని ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఆశించారు. ఉగాది సందర్భంగా ఆదివారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు సాంప్రదాయ వస్త్రాలతో పాల్గొన్నారు . విశ్వ వాసు నామ సంవత్సర పంచాంగ పటాన్ని ఆలకించారు. అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, ని యోజకవర్గ నాయకులు మండల రాము, మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్ల శ్రీనివాస్, పట్టణ మండల అధ్యక్షులు, మాజీ చైర్మన్లు, పట్టణ మండల కమిటీ సభ్యులు, విద్యార్థి సం ఘం నాయకులు, 24 వార్డ్ల ముఖ్య నాయకులు, కాంగ్రెస్ మహిళా కమిటీ, ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.