30-03-2025 06:31:45 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ఉగాది పండుగ సందర్భంగా షడ్రుచుల పచ్చడి ఏ విధంగా ఉంటుందో ప్రజలు మంచి చెడులను ఆస్వాదించి జీవితంలో మెరుగుపడాలని కామారెడ్డి పట్టణ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా పచ్చడి తయారు చేసి సిబ్బందితో కలిసి పచ్చడి పంచుకున్నారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు సిబ్బందికి ఉగాది శుభాకాంక్షలు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.