30-03-2025 04:51:47 PM
మందమర్రి (విజయక్రాంతి): ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ సెంటర్ లోని హనుమాన్ ఆలయం ఎదురుగా ఆదివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది పచ్చడి, బొబ్బట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమొద్దీన్ మాట్లాడారు. ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్, పట్టణ అధ్యక్షులు నందిపాట రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్ పటేల్, మండల అధ్యక్షులు సకినాల శంకర్, జావిద్ పాషా, నాగరాజులు పాల్గొన్నారు.