31-03-2025 12:00:00 AM
కొత్తపల్లి , మార్చి30 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు, బీజేపి మహిళ మోర్చ రాష్ట్ర నాయకురాలు సుజాతరెడ్డి ఆధ్వ ర్యంలో వీరబ్రాహంద్ర స్వామి అనాధ వృద్ధుల ఆశ్రమంలో శ్రీ విశ్వ వసునమ నూతన సంవత్సరం ఉగాది వేడుకలు జరిగాయి.
వృద్దులతో కలిసి పండుగను ఘనంగా నిర్వహించారు. ఉగాది పచ్చడి మరియు భక్షాలను వారికీ అందించి వారితో పండుగను జరుపుకున్నారు. ఈ సందర్బంగా బీజేపీ సీనియర్ నాయకులు తాళ్ల పెళ్లి హరీకుమార్ గౌడ్ మాట్లాడుతు ఎన్నో సంవత్సరాల నుండి సుజాతరెడ్డి ప్రతి తెలుగు పండుగను ఇక్కడ జరుపుకోవడం అభినందనీయ మన్నారు. కరీంనగర్ ఏసీపీ గంగాధర్ వృద్దులకు అన్న ప్రసాద వితరణ చేశారు.