30-03-2025 11:09:07 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): సంగారెడ్డి రామ్ మందిర్ లో టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు నిర్వహించారు. ఆదివారం సంగారెడ్డి పట్టణంలో ఉన్న రామ్ మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకలలో భాగంగా స్వయంగా దోలక్ వాయిస్తూ భజన గీతాలు జగ్గారెడ్డి పాడిన్నారు. ఉగాది వేడుకలకు భారీ సంఖ్యలో హాజరైన భక్తులు హాజరైనారు. లడ్డూ ప్రసాదం అందుకునేందుకు మహిళలు, పిల్లలు పోటీలు పడ్డారు. భజన గీతాలు పాడుతూ భారీ సంఖ్యలో భక్తులు ఊరేగింపులో పాల్గొన్న పాల్గొన్నారు. రామ్ మందిర్ లో ఉగాది వేడుకలలో భాగంగా భక్తులకు ప్యాలల లడ్డూ ప్రసాదాలను ఎగురవేశారు.
ఉగాది సందర్భంగా రామ్ మందిర్ లో ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు, టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలో ప్రతీ ఒక్క గుడిలో ఉగాది రోజు లడ్డూలు పంచే సాంప్రదాయం ఉందన్నారు. నేను పుట్టక ముందు నుండే ఈ సాంప్రదాయం ఉందని తెలిపారు. ఈ సంప్రదాయంలో పిల్లలూ పెద్దలు, మహిలలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ లడ్డూలు కావాలంటే ఆలయానికి రావాల్సిందే అన్నారు. మన పూర్వీకులు ఈ ప్యాలాల లడ్డూలు ఎగరవేయడం వెనుక గొప్ప ఉద్దేశ్యం ఉందని తెలిపారు. ఉగాది రోజు ఈ బెల్లం తీపి లడ్డూలు అందుకుని సంవత్సరమంతా తీపి మాదిరిగా మీ జీవితాలు ఉండాలని మన పూర్వీకులు ఈ ఆచారం తీసుకువచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.