31-03-2025 01:38:26 AM
నల్లగొండ, మార్చి 30 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా వ్యాప్తంగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఆదివారం ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే ఇంటిగుమ్మాలను మామిడి తోరణాలతో అలంకరించి షడ్రుచులతో ఉగాది పచ్చడి తయారు చేసుకొని సేవించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చ నలు, అభిషేకాలు కొనసాగాయి.
భక్తులు పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. పలుచోట్ల స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశాయి. నల్లగొండలోని ఆయా పార్టీల జిల్లా కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు, దామరచర్ల మండ లం వాడపల్లిలోని మీనాక్షీ అగస్తేశ్వరస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. చెరువుగట్టులో రామలింగేశ్వరస్వామికి ఉదయం లక్ష పుష్పార్చన వైభవంగా జరిగింది.