30-03-2025 08:51:56 PM
పలువురికి ఉగాది పురస్కారాలు అందజేత..
మందమర్రి (విజయక్రాంతి): శ్రీ విశ్వవసు నామ ఉగాది పండుగను పురస్కరించుకొని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శిఖర ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది ఉత్సవం వేడుకల్ని పట్టణంలోని శ్రీ మంజునాథ గార్డెన్స్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీసీ సంక్షేమ అధికారి, వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ పూజారి డింగరి కృష్ణ చైతన్య పంచాంగ శ్రవణం వినిపించారు.
అనంతరం ప్రముఖ కర్త రచయిత్రి శ్రీమతి దరిపెల్లి స్వరూప, డాక్టర్ సుమన, చైతన్య, అల్లాడి శ్రీనివాస్ లు ఉగాది సందర్భంగా తమ కవిత్వాలను వినిపించారు. బీసీ అధికారి పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ... ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రతి ఏటా పదిమంది నిష్ణాతులైన వారిని గుర్తించి సత్కరించి ఉగాది పురస్కారం అందజేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఐ.ఎన్టియుసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంపెల్లి సమ్మయ్య మాట్లాడుతూ... శ్రీ విశ్వ వసు నామ ఉగాది సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతుగా చేయూత నందిస్తామన్నారు. ఈ సందర్భంగా చిన్నారి కళాకారులు బొడ్డుపల్లి అమూల్య, ఎనగందుల రూప, పూసాల వృంద, ఆయాన్, రోళ్ళ శ్రీముఖి, ప్రదర్శించిన నృత్యాలు పలువురిని అలరించాయి. అనంతరం ఉగాది పురస్కారం 2025 అవార్డులను అతిధుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి శిఖర ఆర్ట్స్ అధినేత అంతడుపుల నాగరాజు అధ్యక్షత వహించగా ఉప్పులేటి నరేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
పురస్కార గ్రహీతలు వీరే...
మామిడిపల్లి బాపయ్య (మాజీ సర్పంచ్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు) దేవి భూమయ్య (ఐఎన్టియుసి ఏరియా ఉపాధ్యక్షులు) దాగం మల్లేష్ (ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ) పోలు శ్రీనివాస్ (జేఏసీ కన్వీనర్ కరస్పాండెంట్) పిల్లి రవి (మేనేజింగ్ డైరెక్టర్) అల్లాడి శ్రీనివాస్ (ప్రముఖ రచయిత), గాండ్ల సంజీవ్ (ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్, సీనియర్ పాత్రికేయులు) లయన్ మద్ది వేణుగోపాల్ (సామాజిక సేవకులు) దేవర వినోద్ (ఆధ్యాత్మికత సామాజిక సేవకులు) సెగ్గం రాజలింగు (శ్రీ మంజునాథ గార్డెన్స్ అధినేత ) రేగుంట చంద్రకళ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ శివనీతి రాజశేఖర్, అదనపు ఎస్ఐ నూనె శ్రీనివాస్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ నెరువట్ల రాజలింగు, సిపిఐ నాయకులు మాజీ కౌన్సిలర్ రేగుంట చంద్రశేఖర్, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సకినాల శంకర్, సీనియర్ కళాకారులు సాదనవేణి ప్రభాకర్, ఎగ్గేటి రాజేశ్వర్ రావు, రాకం సంతోష్, ఉప్పులేటి గోపిక, అంతర్పుల మధు, సమిండ్ల లక్ష్మి, తోకల నిరోష, స్వప్న లు పాల్గొన్నారు.