calender_icon.png 5 April, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామరాజునగర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

31-03-2025 12:00:00 AM

ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

కుత్బుల్లాపూర్, మార్చ్ 30(విజయ క్రాంతి):ఉగాది వేడుకల్లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 - జీడిమెట్ల డివిజన్ రామరాజు నగర్ లో  నిర్వహించిన విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలకు బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి తనను తను మార్చుకుంటూ, జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ నూతన ఉత్తేజంతో మనం ముందుకు సాగాలని సూచించేదే ఉగాది పండుగ అని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి నన్ను మూడుసార్లు గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన రామరాజు నగర్ కాలనీ వాసులకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ నాయకులు కుంట సిద్దిరాములు, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కాలే గణేష్, బాల మల్లేష్, రామరాజు నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్సింహా రెడ్డి, ఉపాధ్యక్షులు దయానంద్ రెడ్డి, కార్యదర్శి అమ్మి రెడ్డి, మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.