30-03-2025 10:47:33 PM
స్వామివారికి అభిషేకములు, విశేష పూజలు..
గోత్రనామార్చన గో పూజలు..
వైరా (విజయక్రాంతి): వైరా వర సిద్ధి వినాయక మందిరంలో ఆదివారం నూతన తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైరా గణేష్ నగర్ లోని కొలువు తీరిన వినాయక స్వామి మూర్తికి అభిషేకములు నూతన వస్తాలంకరణ విశేషాలంకరణ నివేదన నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. మందిరంలో గో పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడిని భక్తులకు అందించారు. గోత్రనామార్చన తీర్థ ప్రసాదములు స్వీకరించి భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు ఉగాది రోజున స్వామివారికి పట్టు వస్త్రాలను మందిరం సెక్రెటరీ రంగా సత్యనారాయణ వాసవి దంపతులు అందించారు.
అనంతరం అర్చకులు విశ్వా వసునామ ఉగాది విశిష్టతను భక్తులకు వివరించారు. తెలుగు సంవత్సరాలలో 39వ దైన విశ్వాస నామ సంవత్సరంలోకి అడుగు పెట్టామని ఈ పేరు విశ్వ + వసు అనే రెండు పదాల కలయిక విశ్వం వాస యతి అంటే విశ్వానికి నివాసాన్ని కలిగించినవాడు భగవంతుడని అర్థమని తెలిపారు. ఈ పేరు మహావిష్ణువుకు కూడా వర్తిస్తుందని శుభకారకుడు శ్రీహరి పేరిట ఉన్న ఈ ఏడాది అందరికి సంతోషాన్ని కలిగించి పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుందని విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ అన్నింటి క్షేమం కలుగుతుందని తీపి చేదు కలిసిందే జీవితం అని కష్ట సుఖం తెలిసింది. జీవనమని అలాంటి జీవితంలో ఆనందోత్సాహాలను వచ్చేందుకే వచ్చిన ఉగాది పర్వదినం అని తెలిపారు. ప్రజలందరూ సిరిసంపదలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని భక్తులను ఆశీర్వదించారు.
ఈ సంవత్సరం అన్ని రాశుల వారికి సమాన ఫలితాలు ఉన్నాయని అర్చకులు వివరించారు. ఈ అభిషేక కార్యక్రమాల్లో మందిర చైర్మన్ పుప్పాల అనంత రాములు, కోశాధికారి మాదినేని లక్ష్మణరావు, రంగా సత్యనారాయణ వాసవి దంపతులు మాదినేని దుర్గాప్రసాద్ సునీత దంపతులు పసుమర్తి కృష్ణ లలిత దంపతులు మిట్టపల్లి శ్రీనివాసరావు మంజుల దంపతులు రాయపూడి వెంకటేష్ రజనీ దంపతులు రంగా సింహాద్రి ఝాన్సీ దంపతులు పుప్పాల వెంకటేశ్వర్లు లావణ్య దంపతులు కొణతాలపల్లి సుజిత్ మౌనిక దంపతులు కట్ల రంగారావు పాశం శ్యామ్ నల్లమోతు లక్ష్మీనారాయణ రేచర్ల పుల్లయ్య ఏడు నూతల బుచ్చి రామారావు ఫోటోగ్రాఫర్ పమ్మి రాజు అభిషేకం పూజ కార్యక్రమంలో పాల్గొని గో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.