31-03-2025 12:00:00 AM
రాజాపూర్ మార్చి 30:మండల కేంద్రంతోపాటు తిర్మలాపూర్, చొక్కామ్ పెట్, చెన్నవేల్లి, ఈద్గాన్ పల్లి,రాయపల్లి, రంగారెడ్డి గూడ , గుండ్ల పోట్లపల్లి తదితర గ్రామాల్లో ప్రజలు తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. ప్రజలు ఉదయం నుంచి ఇండ్ల గుమ్మాలకు పచ్చతోరణాల తో అలంకరణ చేశారు.
దేవాలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.రైతులు తెల్లవారుజామున వ్యవసాయ పొలంలో భూమి పూజలు నిర్వహిం చారు.సాయంత్రం వేద పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణంలో ఈ సంవత్స రం రాశి ఫలాలు,వర్షాలు గురించి పండితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్ర మంలో వివిధ గ్రామాల పెద్దలు ,రైతులు పాల్గొన్నారు.