calender_icon.png 1 April, 2025 | 6:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఉగాది వేడుకలు

30-03-2025 07:31:06 PM

ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలు..

ఉగాది పచ్చడి పంపిణీ...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఉగాది పండుగను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్ నార్ రమేష్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే హరీష్ బాబు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నూతన పంచాంగ శ్రవణాన్ని వేద పండితులు చదివి వినిపించారు. అన్నదాతలు వ్యవసాయ పనులకు అంకురార్పణ చేశారు. చేన్లలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమాతకు నైవేద్యాలు సమర్పించారు.