30-03-2025 04:43:42 PM
మందమర్రి (విజయక్రాంతి): తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని ఆదివారం పట్టణం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు తమ ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలను అలంకరించారు. అనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారుచేసి సేవించారు. పర్వదినం సందర్భంగా పిండివంటలతో పట్టణం గ్రామాలు ఘుమఘుమలాడాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణం, మండలంలోని పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలు, భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని గావించారు.