calender_icon.png 1 April, 2025 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవి క్లబ్, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

30-03-2025 04:46:45 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి వాసవి క్లబ్, బెల్లంపల్లి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పండుగ వేడుకలను సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అచ్చులాపూర్ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ అప్పల శ్యాం ప్రణీత్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం మంత్రోచ్ఛరణతో అందరికీ ఉగాది పచ్చడ పంపిణీ చేశారు. పంచాంగ శ్రవణం చేసిన శ్యాంప్రనీత్ శర్మతో పాటు పట్టణంలోని పలు దేవాలయాలకు చెందిన అర్చకులకు పంచాంగాలు ఇచ్చి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అప్పాల శ్యాం ప్రణీత్ శర్మ మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరు హిందూ ధర్మాన్ని కాపాడాలని, శ్రీరామ నామంను జపించాలని, కలిసిమెలిసి ఉండాలని కోరారు.

ప్రతి రోజు భగవంతుని నామస్మరణ చేస్తూ దేవాలయాలను సందర్శిస్తూ హిందూ ధర్మాన్ని ఆచరించాలని సూచించారు. ప్రతి ఒక్కరు భగవంతుని ఆశీర్వచనాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు నాగేష్, బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్, టిఆర్ఎస్ నాయకులు కొమ్మెర లక్ష్మణ్, వాసవి క్లబ్ అధ్యక్షులు సామ మహేష్, సెక్రెటరీ అవునూరు సాయి, కోశాధికారి తాటిపల్లి సాగర్, జిల్లా కార్యవర్గ సభ్యులు తాటిపల్లి రమేష్, అంతర్జాతీయ ప్రోగ్రాం విద్యాసాగర్, శిశు మందిర్ ఉపాధ్యక్షులు బల్ల లక్ష్మీనారాయణ, రాంజీ గోండు కాసర్ల తిరుపతి, వాసవి క్లబ్ అంతర్జాతీయ సభ్యులు బాల సంతోష్, రేణిగుంట శ్రీనివాస్, మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు పాత భాస్కర్, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.