29-03-2025 12:00:00 AM
అధికారికంగా నిర్వహిస్తున్న సర్కారు
హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. శుక్రవారం ఉగాది వేడుకల గురించి వివిధ శాఖల అధికారులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ చర్చించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన అనుమతి, నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ వేడుకల్లో ప్రజలు పాల్గొనాలని ఆమె కోరారు.