calender_icon.png 2 April, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియో గీతాంజలి స్కూల్లో ఘనంగా ఉగాది సంబరాలు

29-03-2025 10:04:26 PM

కూకట్ పల్లి (విజయక్రాంతి): ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిజాంపేటలోని నియో గీతాంజలి స్కూల్లో వేడుకలు వైభవంగా జరిగాయి. ఉగాది పండుగను పురస్కరించుకొని విద్యార్థులు పలు రాష్ట్రాల సాంప్రదాయ వస్త్రాలు ధరించి అందర్నీ ఆకట్టుకున్నారు. నియో గీతాంజలి డైరెక్టర్ రమాదేవి ప్రిన్సిపాల్ రఘుబాలలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ రఘుబాల స్కూల్ డైరెక్టర్ రమాదేవి మాట్లాడుతూ... సాంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఉగాది పండుగ యొక్క విశిష్టతలను భవిష్యత్ తరాలకు కళ్ళకు కట్టినట్టుగా పండుగ యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఉగాది పంచాంగాన్ని చదివి వినిపించి అందరికీ ఉగాది పచ్చడిని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.