calender_icon.png 1 April, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవభారత్ హైస్కూల్లో ఉగాది వేడుకలు

29-03-2025 05:50:50 PM

హుస్నాబాద్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని నవభారత్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ కరస్పాండెంట్ గంగరవేణి రవి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసి, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులతో పంచుకున్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు చేసిన నృత్యాలు, ప్రదర్శనలు అందరినీ అలరించాయి.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రవి మాట్లాడుతూ ఈ 'శ్రీ విశ్వావసు నామ సంవత్సర' ఉగాది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ... "విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయాలు తెలియడం చాలా ముఖ్యమన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థులకు సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.