calender_icon.png 1 April, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజీర కాన్సెప్ట్ స్కూల్ లో ఘనంగా ఉగాది వేడుకలు

29-03-2025 09:32:46 PM

గజ్వేల్: గజ్వేల్ పట్టణంలోని మంజీరా కాన్సెప్ట్ స్కూల్ లో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం  ఘనంగా నిర్వహించారు. సంస్కృతి, సంప్రదాయాలు,ఆచారాలు పండుగల విశిష్టతను నేటి తరం విద్యార్థులకు తెలియజేసే క్రమంలో ఈ ఉగాది వేడుకలను నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ అంబదాస్ తెలిపారు. నేటి ఆధునిక జీవనశైలిలో పెద్దల నుండి మొదలుకొని పిల్లల వరకు ప్రతి ఒక్కరూ సాంకేతికత (సెల్ ఫోన్,టీ.వి etc.) మోజులో పడి ఆ నాటి ఆట పాటలను మరిచిపోతున్నారు.  పాత ఆట,పాటలను నేటి తరానికి తెలియజేయడం కోసం, తల్లిదండ్రులకు ఆటవిడుపుగా కొన్ని పాత ఆటలను నిర్వహించామన్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన భువన విజయం అందరిని అలరించింది. ఈ కార్యక్రమంలో  డైరెక్టర్ రజిత ,ప్రగతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చౌదరి  పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.