calender_icon.png 3 April, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీభవన్.. పేదల దేవాలయం: మహేష్ కుమార్

30-03-2025 12:41:15 PM

హైదరాబాద్: గాంధీ భవన్ లో ఉగాది పండుగ(Ugadi festival celebrations) వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం(Revanth Reddy CM)గా, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా క్యాబినెట్ మంత్రులు(Cabinet Ministers) ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని చెప్పారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్న ఆయన పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు ముందుకు వస్తున్నారని సూచించారు. మనం పండిస్తున్న సన్నబియ్యం ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. విద్య పరంగా చాలా ఆలోచనలు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని సూచించారు. దేశంలో మల్లికార్జున్ ఖర్గే, యువ నాయకులు రాహుల్ గాంధీ(Rahul Gandhi), సోనియమ్మ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతో పటిష్టతతో ఉందని వివరించారు. మరో పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్(Gandhi Bhavan)లో పేదల దేవాలయం లాంటిదన్న మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ వారి కోసమే పని చేస్తుందన్నారు. రాష్ట్రం ఈ విశ్వవసు సంవత్సరంలో రాష్ట్రం మంచి అభివృద్ధి జరగాలని ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందాలని కోరుకుంటున్నానని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.