30-03-2025 04:31:04 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం విశ్వవసు నామ సంవత్సర ఉగాది పండగను పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మిఠాయి పంచుకుని వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి మాట్లాడుతూ... ఈ ఉగాది పండుగ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను అందించాలని కోరారు.
బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న శాసనసభ్యులు గడ్డం వినోద్ కు ఆయురారోగ్యాలు ఇచ్చి బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి శక్తి సామర్ధ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు, మీడియా మిత్రులకు, ప్రభుత్వ అధికారులకు, పోలీస్ సిబ్బందికి అన్ని శాఖల అధికారులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వీర స్వామి, కనుకుంట్ల రాజేష్, కాసర్ల యాదగిరి, కిషన్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.