calender_icon.png 1 April, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగిపేటలో ఉగాది వేడుకతో పంచాంగ శ్రవణం

31-03-2025 01:19:08 AM

 అందోల్, మార్చి 30 :జోగిపేట లో జోగినాథ స్వామి  ఆలయం వద్ద ఉగాది పండుగను పురస్కరించుకొని   జోగిపేట ప్రధాన పురోహితులు చిదిరే క్రిష్ణ మూర్తి పంతులు, రమణ శర్మ పంతులు, ఆలయ అర్చకులు మడుపతి బద్రప్ప పంచాంగ శ్రవణం చేశారు. విశ్వవసునామ సంవత్సరంలో 12 రాశుల స్థితిగతులపై విశ్లేషించారు.

లాభనష్టాలను వివరించారు. జోగిపేట పురోగతిపై రాశుల ప్రభావం ఏ విధంగా ఉందో స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో జోగినాథ స్వామి ఆలయం కమిటీ అధ్యక్షుడు డి.శివశంకర్, ఆలయ కమిటీ నిర్వాహకులు పట్లురీ శివ శేఖర్, సురేందర్ గౌడ్, రామాగౌడ్, గూడెం మల్లయ్య ఎ. మణయ్య కమిటీ సభ్యులు తమ్మలీ నర్సింలు, చాపల వెంకటేశం, పట్లోల్ల ప్రవీణ్ కుమార్, చింకుంట బిక్షపతి, బాయికాడీ భూమయ్య, బంజ రవి, రమేషప్ప, పిట్ల లక్ష్మణ్, అల్లే గోపాల్, కొత్త శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, తీమ్మిగారి పాండు రంగం, ఎంఈఓ క్రిష్ణ,  బసవ శివ కుమార్, బేలూరు రవీందర్, జోగిపేట ప్రముఖులు రాం రెడ్డి, రెడ్డి పల్లి బ్రహ్మయ్య , కొత్త యాదయ్య, రంగం పేట రాం చందర్, నర్రా నాగేష్, బయికాడి శ్రీశైలం, ఆకుల యాదగిరి, ఆకుల నాగయ్య, ఆకుల శంకర్  మరియు జోగిపేట పట్టణ ప్రజలు పాల్గొన్నారు.