31-03-2025 12:00:00 AM
- చివరి రోజు కన్నుల పండువగా సాగిన రథోత్సవం
- హాజరైన నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా
నాగర్ కర్నూల్ మార్చి 30 (విజయక్రాంతి)శ్రీశైల మల్లన్న క్షేత్రంలో ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఈనెల 12 నుంచి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు కాలినడకన వచ్చి శ్రీశైల మల్లికార్జున బ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకున్నారు.
భ్రమరాంబిక అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తూ కన్నడ భక్తులు చీర సారెలను సమర్పించారు. ఆదివారం చివరి రోజు అత్యంత వైభవపేతంగా రథోత్సవాన్ని నిర్వహించగా లక్షలాదిగా వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఆలయ అధికారులు పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లను కల్పించారు.
ఆదివారం జరిగిన రథోత్సవ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, శ్రీశైల మల్లన్న ఆలయ ఈవో శ్రీనివాసరావు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.