19-03-2025 02:19:00 AM
మంథనిలో జిల్లా ఉగాది పూరిస్కారాల కన్వీనర్ మంద భాస్కర్ యాదవ్
మంథని మార్చి 18 (విజయ క్రాంతి): యాదవ చారిటబుల్ ట్రస్ట్, పెద్దపల్లి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని నిష్టాతులైన యాదవులను గుర్తించి పురస్కారాలు అందజేయడం జరుగుతుందని మంగళవారం మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో జిల్లా ఉగాది పూరిస్కారాల కన్వీనర్ మంద భాస్కర్ యాదవ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మంథని మండల యాదవ సంఘం అధ్యక్షుడు మోహన్ యాదవ్ తో పాటు పలువురితో కలిసి మాట్లాడుతూ యాదవులలో నిష్టాతులైన యాదవులను గౌరవించుకునే కార్యక్రమం ఉగాది పురస్కారాలు-2025 సన్నాహక సమావేశంను అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా, అనుబంద సంఘాలు సెలక్షన్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశామని.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలలలోని యాదవ లు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. అర్హులైన యాదవులు అప్లికేషన్ లను ఈ నెల 23 లోపు దరఖాస్తులు చేసుకోవాలని, అప్లికేషన్ల స్క్రీనింగ్ 25న ఉంటుందని, అవార్డుల ప్రధానమని, ఉగాది పండుగా 30 న (ఆర్ కె) రాధాకృష్ణ గార్డెన్, రాఘవపూర్ లో సన్మానంతో సత్కరిస్తామన్నారు.
ఎంపిక విభాగాలు. ప్రింట్ మీడియా విభాగం, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం, సాహితి, సాహిత్య రంగ విభాగం,సాంస్కృతిక రంగ విభాగం. రాజకీయ రంగ విభాగం. మహిళా సాధికారత విభాగం, స్వచ్ఛంద సేవ విభాగం, విద్యా రంగ విభాగం,ప్రతిభా పురస్కార్ ( ఈ తెలుగు సంవత్సరంలో ఉన్నత ఉద్యోగాన్ని సాధించిన శ్రమ కుటుంబం), యాదవులందరు విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని లక్ష్మణ్ యాదవ్, మంథని డివిజన్ యూత్ అధ్యక్షులు కనవేన శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు వేముల లక్ష్మణ్ యాదవ్, కానుగంటి ఓదెలు యాదవ్, ముత్తారం మండలం అధ్యక్షులు కాసు తిరుపతి యాదవ్, యూత్ అధ్యక్షులు చెలికల యుగేందర్ యాదవ్, యాదవ్ నాయకులు పెరవేన లింగయ్య యాదవ్, మర్రి సతీష్ యాదవ్, కావటి సతీష్ యాదవ్, కొడారి మల్లేష్ యాదవ్, మాధరవేన కిషన్ యాదవ్, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.