calender_icon.png 1 April, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారమిత లిటిల్ జీనియస్ పాఠశాలలో ఘనంగా ఉగాది, రంజాన్ వేడుకలు

29-03-2025 08:40:21 PM

కరీంనగర్ (విజయక్రాంతి): స్థానిక మంకమ్మతోటలోని పారమిత లిటిల్ జీనియస్ పాఠశాలలో ముందస్తు ఉగాది రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని పారమిత  పాఠశాలల డైరెక్టర్ ప్రసూనప్రసాదరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రకంలో చిన్నారులు ఉగాది ప్రాధాన్యతను తెలియజేసే క్రమంలో షడ్రుచులతో కూడిన పచ్చడిని స్వయంగా తయారు చేసి అందరికి ఆ పంచి ఆ పచ్చ డి యొక్క గొప్పతనాన్ని వివరించిన వైనం అందరిని ఆకట్టుకుంది. 

కార్యక్రమలో భాగంగా  ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్  స్నేహ భావానికి ప్రతీకగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులు కురాన్ యొక్క ప్రత్యేకతను చాలా చక్కగా వివరించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పారమిత పాఠశాలల అధినేత డా. ఇనుగంటి ప్రసాదరావు స్నేహితులకు పట్టణ ప్రజలకు, తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యాసంస్థల డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, వినోదరావు, ప్రధానోపాధ్యాయులు కవిత ప్రసాద్, బాలాజీ, ప్రశాంత్ సమన్వయ కర్తలు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.