calender_icon.png 22 April, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూజీ రెండేళ్లు ఇక్కడ.. రెండేళ్లు అక్కడ!

22-04-2025 01:01:20 AM

అనురాగ్, అమెరికా అరిజోనా వర్సిటీల మధ్య ఒప్పందం

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): తెలంగాణలోని అనురాగ్ యూనివ ర్సిటీ, అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలు (ఏఎస్‌యూ) కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నాలుగేళ్ల యూజీ కోర్సు ను రెండేళ్లు ఓ యూనిర్సిటీలో, మరో రెండే ళ్లు మరో యూనివర్సిటీలో చదువుకొనేందుకు విద్యార్థులకు వెసులుబాటు కల్పిస్తూ ఈ రెండు వర్సిటీలో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

సోమవారం హైదారబాద్, బేగం పేట్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో అనురాగ్ వర్సిటీ చైర్మన్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏఎస్‌యూ సీనియర్ డైరెక్టర్ క్రిస్ జాన్సన్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ భారతీయ విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను సులభతరం చేయ డం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని, తక్కు వ ఖర్చుతో నాణ్యమైన అంతర్జాతీయ విద్య ను అందించాలనే ఈ ఒప్పందాన్ని చేసుకున్నట్టు తెలిపారు.

విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్సేం జ్ ఉంటుందని, ఇక్కడి విద్యార్థులు అక్కడ.. అక్కడి విద్యార్థులు ఇక్కడ చదువుకోవచ్చని వెల్లడించారు. నాలుగేళ్ల యూజీ ప్రోగ్రామ్ లో రెండేళ్లు అనురాగ్ కాలేజీలో.. రెండేళ్లు  అమెరికాలోని ఏఎస్‌యూ కాలేజీలో కోర్సు ను పూర్తి చేయొచ్చని తెలిపారు. 40 శాతం వరకు ఖర్చును ఆదా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డిగ్రీని సులభంగా పొందొచ్చని పేర్కొన్నారు.

ఈక్రమంలోనే కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ రంగంలో ఏఎస్‌యూ, ఏయూ మ ధ్య ఒప్పందం కుదిరినట్టు ఆయన పేర్కొన్నా రు. ఏఎస్‌యూ సీనియర్ డైరెక్టర్ క్రిస్ జాన్స న్ మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అనురాగ్, ఏఎస్‌యూలు అత్యుత్తమ విద్యను అందించనున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో అనురాగ్ వర్సిటీ సీఈవో ఎస్ నీలిమ, అనురాగ్ వర్సిటీ వీసీ డాక్టర్ అర్చన మంత్రి, సింతన ఎడ్యుకేషన్ సౌత్ ఇండియా రీజనల్ హెడ్ చైతన్య చిట్ట, అనురాగ్ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ పల్లా అనురాగ్ పాల్గొన్నారు.