సనాతనంపై క్షమాపణ చెప్పేదే లే: ఉదయనిధి
చెన్నై, అక్టోబర్ 22: సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎట్టి పరిస్థితు ల్లో క్షమాపణ చెప్పనని తమిళనాడు డిప్యూ టీ సీఎం, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీక రించారని ఆరోపించారు. ‘మహిళలను చదువుకోనివ్వరు.
వారిని ఇంటి నుంచి బయటకు రానివ్వరు. ఈ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పెరియార్ గళమెత్తారు. నేను పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ (కరుణానిధి) సిద్ధాంతాలను పాటిస్తాను. కానీ, నా మాటలను వక్రీక రించారు. క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ, నా మాటలకు ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను. నేను కలైంజ్ఞర్ మనుమడిని. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని ప్రకటించారు.
* మహిళలను చదువుకొనేందుకు అనుమతించరు. వారిని ఇంటి నుంచి బయటకు రానివ్వరు. వారి భర్తలు మరణిస్తే వారుకూడా మరణించాలని నియ మాలు పెట్టారు. ఈ మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పెరియార్ గళమెత్తా రు. నేను పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ (కరుణానిధి) సిద్ధాంతాలను పాటిస్తాను.
తమిళనాడు డిప్యూటీ సీఎం
ఉదయనిధి స్టాలిన్