హైదరాబాద్‌కు చేరువలో శంషాబాద్‌లో ‘అంతర్జాతీయ విమానాశ్రయం’ నిర్మించిన తరువాత బేగంపేట విమానాశ్రయం దాదాపు నిరుపయోగంగా మారింది. కేవలం ప్రత్యేక విమానాలు దిగటానికి, ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి పెద్దలు వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగపడుతున్నది. నగరం మధ్యలో ఉన్న బేగంపేట విమానాశ్రయం నుంచి చిన్న నగరాలకు ఉద్దేశించిన ‘ఉడాన్’ పథకం (యుడిఏఎన్ ప్రాంతీయ విమాన కనెక్టివిటీ ప్రాజెక్ట్) కింద వైమానిక సేవలు అందిస్తే బావుంటుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లలోని చిన్న నగరాలకు విమాన ప్రయాణ సౌకర్యం మెరుగవుతుంది. ‘ఉడాన్’ సేవలను మరింత మెరుగు పరచవచ్చు. కేంద్ర విమానయాన శాఖ ఈ దిశగా దృష్టి సారించాల్సిందిగా విజ్ఞప్తి.
కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్