- పథకాన్ని పొడిగించిన కేంద్రం
- కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ప్రాంతీయ విమానాశ్రయాలను అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకొచ్చిన ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్లపాటు పొడగిస్తున్నట్టు విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. ఉడాన్ ప్రారంభించి నేటితో 8ఏళ్లు పూర్తున సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ పథకం ద్వారా రీజినల్ ఎయిర్‌లైన్స్ విపరీతంగా పెరి గాయని, మారుమూల ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ పెరగడంతో టూరిజం బాగా అభివృద్ధి చెందిందన్నారు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని వెల్లడించారు. 2014లో 74 విమానాశ్రయాలు ఉండగా.. ఉడాన్ పథకం వల్ల వాటి సంఖ్య 2024 నాటికి 157కు చేరిందని వివరించింది. ఈ సంఖ్య 2047 నాటికి 350-400కు చేరుకుంటుందని చెప్పింది.
మార్పు తెచ్చింది: పీఎం మోదీ
ఉడాన్ పథకం వల్ల దేశ విమానయాన రంగం స్వరూపమే మారిపోయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నూతన వాయు మార్గాలు అందుబాటులోకి రావడంతోపాటు విమానాశ్రయాల సంఖ్య కూడా ఈ పథకం వల్లే పెరిగాయని ఎక్స్ వేదికగా తెలిపారు.