calender_icon.png 2 February, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా అభిమానులకు ఉదిత్ నారాయణ్ ముద్దులు!

02-02-2025 12:50:37 AM

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కొన్ని రోజుల క్రితం నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో భాగంగా తన కెరీర్‌లోనే పేరు పొందిన పాటలను ఆలపించారు.  ‘మెహ్రీ’లోని ‘టిప్ టిప్ బర్‌సా’ పాట పాడుతున్న సమయంలో తనతో సెల్ఫీలు తీసుకునేందుకు ముందుకొచ్చిన మహిళా అభిమానులకు సెల్ఫీ ఇవ్వడంతో పాటు ముద్దులు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీంతో ఆయన తీరును తప్పుబడుతూ పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ వివాదంపై ఉదిత్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. “అభిమానులు నాపై ఉన్న ఇష్టాన్ని ఎన్నో విధాల ప్రయత్నిస్తారు. షేక్ హ్యాండ్ ఇవ్వడం.. ముద్దు పెట్టుకోవాలనుకోవడం చేస్తుంటారు.

అది ఆత్మీయతతో కూడుకున్నదే. నేను చాలా మర్యాద, సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తిని. నాకు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించే ఉద్దేశం లేదు. వివాదాలకు దూరంగా ఉండే నన్ను కావాలనే ఈ వివాదంలోకి లాగుతున్నారు” అని పేర్కొన్నారు.